శభాష్ చింతకుంట మధు

శభాష్ చింతకుంట మధు

సత్కరించిన నగర మేయర్ మహమ్మద్ వసీం

 

అనంతపురం.

ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడిన 39 వ డివిజన్ కన్వీనర్ చింతకుంట మధును నగర మేయర్ మహమ్మద్ వసీం ఘనంగా సన్మానించారు.నగరంలోని లక్ష్మీ నగర్ లో బుధవారం రాత్రి ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు లోతైన డ్రైనేజీలో పడిపోయారు. అయితే స్థానికులు ఎవరూ డ్రైనేజీలోకి దిగడానికి ధైర్యం చేయని పరిస్థితుల్లో 39 వ డివిజన్ కన్వీనర్ చింతకుంట మధు డ్రైనేజీ కలువలోకి దిగి అతనిని బయటకు తీసుకువచ్చారు.విషయం తెలుసుకున్న నగర మేయర్ మహమ్మద్ వసీం తన ఛాంబర్ లో చింతకుంట మధును అభినందించి,సన్మానించారు. నీవు చేసిన ఈ ప్రయత్నం ఆపదలో ఉన్న వారిని రక్షించేందుకు మరెందరికో స్పూర్తిగా నిలుస్తోందని అభినందించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు కమల్ భూషణ్,శ్రీనివాసులు,నాయకులు మధు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.