శభాష్ వలంటీర్ రామ్మోహన్ -కర్నూలు ఆసుపత్రికి వెళ్లి పింఛన్ నగదు పంపిణీ
శభాష్ వలంటీర్ రామ్మోహన్
-కర్నూలు ఆసుపత్రికి వెళ్లి పింఛన్ నగదు పంపిణీ
AP39 TV న్యూస్ ,కూడేరు:
కూడేరు మండలం చోళసముద్రం గ్రామానికి చెందిన వలంటీర్ రామ్మోహన్ గురువారం సొంతంగా రవాణా ఖర్చులు పెట్టుకొని కర్నూలు ఆసుపత్రికి వెళ్లి శ్యామలమ్మ అనే పింఛన్ లబ్ధిదారురాలుకి నగదును అందజేశాడు. శ్యామలమ్మకు ఆరోగ్యం బాగా లేకపోతే కొద్ది రోజులుగా కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది .ఆమె ఇంటిదగ్గర అందుబాటులో లేదన్న విషయం తెలుసుకున్న రామ్మోహన్ కర్నూలు కి వెళ్లి పింఛన్ అందజేశాడు .ఈ పింఛన్ నగదు వైద్య ఖర్చులకు ఎంతగానో ఉపయోగపడతాయని
కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు .ఇంత దూరం వచ్చి నగదు అందజేసినందుకు కుటుంబ సభ్యులు వలంటీర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.
రిపోర్టర్ :పవన్ కుమార్
కూడేరు