“జగనన్న సురక్ష “పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు
– ఎంపీపీ నారాయణరెడ్డి
AP 39TV,న్యూస్ కూడేరు:
రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న సురక్ష పట్ల ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని ఎంపీపీ నారాయణరెడ్డి పేర్కొన్నారు. గురువారం కూడేరు సచివాలయం-1 వద్ద జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. గత వారం రోజులుగా ఇంటింటా చేపట్టిన సర్వేలో దరఖాస్తు చేసుకున్న వారికి కుల ,ఆదాయ జనన ,మరణ ఇతర సర్టిఫికెట్లు మంజూరు అయ్యాయి. వాటిని లబ్ధిదారులకు ఎంపీపీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంతకు మునుపు సర్టిఫికెట్లు కోసం కార్యాలయాలు చుట్టూ తిరిగి ఇబ్బంది పడేవారు .ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు వర్తించాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న సురక్షకు శ్రీకారం చుట్టి ప్రజలకు ఉచితంగా సర్టిఫికెట్లు మంజూరుకు చర్యలు చేపట్టారని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ లలితమ్మ, ఎంపిటిసి సభ్యురాలు వెంకటలక్ష్మమ్మ, ఎంపీడీవో ఎంకే భాషా ,డిటి విశ్వనాథ్ , ఏపీయం రాజశేఖర్ , పంచాయతీ కార్యదర్శులు రఘు , శివరంజని, మహిళా పోలీస్ పుష్ప ,సచివాలయ బు ఉద్యోగులు ,వైఎస్సార్ సీపీ నేతలు బైరెడ్డి రామచంద్రారెడ్డి , ఎర్ర నాగప్ప ,రామాంజనేయులు , వాలంటీర్లు పాల్గొన్నారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు