సమ్మెలోకి వెళ్లిన సిపిడబ్ల్యూఎస్ తాగునీటి కార్మికులు
AP39TV న్యూస్ ,కూడేరు:
కూడేరు మండలానికి సంబంధించిన సిపిడబ్ల్యూఎస్ తాగునీటి పథకానికి సంబంధించిన కార్మికులు మంగళవారం సమ్మెబాట పట్టారు .ఈ సందర్భంగా కార్మికులు నాగరాజు ,సుధాకర్ , శ్రీనాథ్ , నవీన్ తో పాటు పలువురు కార్మికులు మాట్లాడుతూ నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు .కాంట్రాక్టర్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు విన్నవించుకున్న ఫలితం లేకుండా పోయిందన్నారు. సక్రమంగా వేతనాలు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురై కుటుంబ పోషణ భారమవుతుందని వారు వాపోయారు .ఈ ప్రాజెక్టులో సుమారు 30 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు వారు తెలిపారు. పెండింగ్ వేతనాలు ఇస్తేనే విధుల్లోకి చేరుతామని వారు తెగేసి చెప్పారు . సూపర్ వైజర్ మంజునాథరెడ్డి కార్మికులతో చర్చించినప్పటికీ అధికారులు వచ్చి వేతనాలు ఇస్తామని హామీ ఇస్తేనే సమ్మె విరమిస్తామని కార్మికులు స్పష్టం చేశారు.