తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులిచ్చే పంటలు సాగు చేసేలా చైతన్య పరచండి
తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులిచ్చే పంటలు సాగు చేసేలా చైతన్య పరచండి
– ఏడీఏ రవికుమార్
AP39 TV న్యూస్ ,కూడేరు:
తక్కువ పెట్టుబడితో ఎక్కువ
దిగుబడిలిచ్చే రాగి ,జొన్న , కొర్ర వంటి పంటలు సాగు చేసేలా రైతులను చైతన్య పరచాలని వ్యవసాయ శాఖ అనంతపురం డివిజన్ ఏడిఏ రవికుమార్ మండల సిబ్బందికి సూచించారు .శుక్రవారం కూడేరులో మండల స్థాయి అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది .ఈ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు అందుబాటులో ఉండి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు అర్హులైన రైతులందరికీ దక్కేలా చూడాలన్నారు .పంటల సాగులో తగు సూచనలు,సలహాలు ఇవ్వాలని ఆదేశించారు. రైతుల నుంచి ఫిర్యాదులు వస్తే చర్యలు ఉంటాయన్నారు. వేరుశనగకు ప్రత్యామ్నాయంగా ఇతర పంటల సాగుకు రైతులు ఆసక్తి చూపాలని తెలియజేశారు .సబ్సిడీతో ఆముదం విత్తనాలను ఇచ్చేలా చూడాలని కమిటీ సభ్యులు దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం ప్రభుత్వం సబ్సిడీతో అందిస్తున్న విత్తన వేరుశనగను రైతులకు పంపిణీ చేశారు .కార్యక్రమంలో మండల అగ్రి అడ్వైజరి కమిటీ చైర్ నిర్మలమ్మ, ఎంపీపీ నారాయణరెడ్డి ,ఏవో విజయకుమార్ , ఏఈఓ శైలజ , వెటర్నరీ డాక్టర్ శ్వేత , ఆర్బికేల చైర్మన్లు , సభ్యులు , వ్యవసాయ శాఖ సిబ్బంది, వివిధ ఫర్టిలైజర్ షాపుల యజమానులు పాల్గొన్నారు..
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు.