తేదేపా ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ శిక్షణా కార్యక్రమం లో గుండుమల తిప్పేస్వామి
తేదేపా ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ శిక్షణా కార్యక్రమం లో గుండుమల తిప్పేస్వామి
AP39TV న్యూస్ జులై 20
గుడిబండ:- మండల కేంద్రంలోని లాయర్ శివకుమార్ ఇంటి ఆవరణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు ఇంటిగ్రేటెడ్ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండుమల తిప్పేస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆర్టిఎస్,ఐటిడిపి యాప్ లపై అవగాహన కలిగి ఉండి సాంకేతికతను ఉపయోగించుకొని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెదేపా మండల అధ్యక్షులు మద్దనకుంటప్ప, ప్రధాన కార్యదర్శి ప్రకాష్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు మంజునాథ్, డాక్టర్ సెల్ అధ్యక్షుడు కొంకల్లు కృష్ణమూర్తి, నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ లు రామకృష్ణ, శివకుమార్,కాంతరాజు,లాయర్ శివకుమార్, దుర్గేష్, క్లస్టర్ ఇంచార్జీలు తిమ్మాలాపురం భీమరాజు, లక్ష్మీనరసప్ప నాయకులు నజీర్,బూదిపల్లి జయరామ్, చిగతుర్పిమంజునాథ్, రామచంద్ర, తదితర తెలుగుదేశంపార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
కొంకల్లు శివన్న
రిపోర్టర్
AP39TV
మడకశిర ఇంచార్జ్ గుడిబండ