15 టిడిపి కుటుంబాలు వైఎస్సార్ సీపీలోకి చేరిక

15 టిడిపి కుటుంబాలు వైఎస్సార్ సీపీలోకి చేరిక

-పార్టీలోకి ఆహ్వాని ఎంపీపీ నారాయణ రెడ్డి

కూడేరు,మార్చి12(AP 39 TV న్యూస్):-

కూడేరు మండల పరిధిలోని ఎంఎం హ ల్లి ఎస్టీ కాలనీకి చెందిన 15 టిడిపి కుటుంబాలు వైయస్సార్ సిపి తీర్థం పుచ్చుకున్నాయి. మంగళవారం కూడేరులో మాజీ సర్పంచ్ సావిత్రమ్మ ఆధ్వర్యంలో ఎంపీపీ నారాయణరెడ్డి సమక్షంలో వారు పార్టీలోకి చేరారు .ఎంపీపీ నారాయణరెడ్డి ,మండల కన్వీనర్ బైరెడ్డి రామచంద్రారెడ్డిలు వారికి కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో శివశంకర్, కోడుపల్లి ఆంజనేయులు ,లింగమ్మ , వెంకటేష్ ,మహాలక్ష్మి ,సాకే రమేష్ ,తిరుపతమ్మ ,సాకే లక్ష్మీదేవి ,సాకే మహాలక్ష్మి, శ్రీనివాసులు ,గుజ్జుల శివన్న, ఎర్రమ్మ ,రామస్వామి ఉన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు క్రిష్టప్ప ,ఎర్రిస్వామి, శ్రీనివాసులు, గోవిందు తదితరులు పాల్గొన్నారు.

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.