తెలుగుదేశం పార్టీ నాయకులను పరామర్శించిన మడకశిర నియోజకవర్గ ఇంచార్జ్ గుండుమల తిప్పేస్వామి
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు మెకానిక్ ప్రభాకర్ గత రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి హిందూపురం పట్టణంలో శ్రీ రాఘవేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు విషయం తెలుసుకున్న మడకశిర నియోజకవర్గ ఇంచార్జ్ గుండుమల తిప్పేస్వామి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులను పరామర్శించారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఉమాశంకర్, పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు తిమ్మరాజు, మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు ఎల్లోటి బద్రి, అంజి తదితరులు పాల్గొన్నారు.