రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న రమణ ప్రసాద్
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న రమణ ప్రసాద్
కూడేరు (సెప్టెంబర్ 5 )AP 39TV న్యూస్:-
కూడేరు మండలం పి. నారాయణపురం ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న రమణ ప్రసాద్ రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు .మంగళవారం విశాఖపట్నంలోని ఏ .యూ. కాన్వకేషన్ హాల్ లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. మంత్రి చేతుల మీదుగా రమణ ప్రసాద్ అవార్డును అందుకున్నారు. రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డు రావడం ఎంతో ఆనందంగా ఉందని రమణ ప్రసాద్ తెలిపారు
తమ్మిశెట్టి పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు.