ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనది

ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనది

-బాలికాభివృద్ది జిల్లా అధికారి మహేశ్వరి

కూడేరు(సెప్టెంబర్ 5)AP 39TV న్యూస్:-

సమాజ నిర్మాణానికి ఉపాధ్యాయుల పాత్ర కీలకమైందని జిల్లా బాలికాభివృద్ధి అధికారి మహేశ్వరి పేర్కొన్నారు. మంగళవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని కూడేరు కేజీబీవి పాఠశాల, కళాశాలలో గురు పూజోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు . ఆమెకు కేజిబీవి ప్రిన్సిపాల్ ఉమాదేవి , పాఠశాల ఉపాధ్యాయినులు, విద్యార్థినిలు స్వాగతం పలికారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో జీసిడిఒ మహేశ్వరీ మాట్లాడుతూ, ఉపాధ్యాయుల జీవితం ఎందరికో ఆదర్శనీయమన్నారు. ప్రతి మనిషికి ఉపాధ్యాయులతో అవినాభావ సంబంధం ఉంటుందన్నారు. ఎన్ని తరాలు మారిన ఉపాధ్యాయుల పాత్ర మారదన్నారు. విద్యార్థులు కూడా ఉపాధ్యాయులను ఆదర్శంగా తీసుకొని ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో కేజిబివి విద్యా బోధకులు ,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

తమ్మిశెట్టి పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.