సంగమేశ్వరుడి ఆలయ ధర్మకర్తగా రామదుర్గం క్రిష్టప్ప
సంగమేశ్వరుడి ఆలయ ధర్మకర్తగా రామదుర్గం క్రిష్టప్ప
కూడేరు,AP 39 TV న్యూస్:-
కూడేరులో ప్రఖ్యాతిగాంచిన శివ పార్వతుల జోడి లింగాల సంగమేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తగా రామదుర్గం క్రిష్టప్ప శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. దేవాదాయ శాఖ ఇన్ స్పెక్టర్ లక్ష్మీనారాయణ అధ్యక్షతన ఆలయ నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది . కమిటీ సభ్యులుగా టీవీల మెకానిక్ శంకర్ రెడ్డి, రెంటాల శ్రీనివాసులు, లీలావతి ,ప్రతిభ భారతి ,అలివేలమ్మ ,పద్మావతి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి విచ్చేశారు. ఆలయాన్ని అభివృద్ధి పరచాలని విశ్వేశ్వర్ రెడ్డి నూతన కమిటీ సభ్యులకు సూచించారు . కార్యక్రమంలో ఎంపీపీ నారాయణరెడ్డి, జెడ్పిటిసి సభ్యురాలు తుప్పటి అశ్విని, మండలం కో ఆప్షన్ సభ్యుడు సర్దార్ వలి,వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ బైరెడ్డి రామచంద్రారెడ్డి, సర్పంచులు ఓబులేసు, రామాంజనేయులు, ఎంపీటీసీ సభ్యుడు రమేష్, పార్టీ నేతలు విజయభాస్కర్ రెడ్డి ,సుబ్బారెడ్డి ,శంకర్ నాయక్ ,రామాంజనేయులు రాగే కిష్టప్ప, రాజు ,ఎర్ర నాగప్ప, హరిజన సంగప్ప,ఆలయ ఈవో బాబు తదితరులు పాల్గొన్నారు.
పవన్ కుమార్ ,
రిపోర్టర్
కూడేరు