జోడు లింగాలను” దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి
“జోడు లింగాలను” దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి
AP 39 TVన్యూస్ కూడేరు:
దక్షిణ భారతదేశంలోని శివాలయాల్లో ఒకటిగా పేరుగాంచిన కూడేరులో వెలిసిన శివపార్వతుల జోడి లింగాల సంగమేశ్వర స్వామి ఆలయాన్ని బుధవారం ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్ రెడ్డి సందర్శించారు. ఆలయ అర్చకులు ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం విశ్వేశ్వర్ రెడ్డి జోడి లింగాలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేయించారు. ఆలయ అర్చకుడు మహేష్ ఆయనకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆయన వెంట కమ్మూరు సర్పంచ్ రంగారెడ్డి, వైయస్సార్ సిపి నేతలు సంగప్ప ,వన్నూరప్ప ,చంద్ర తదితరులు ఉన్నారు.