గొల్లపల్లి సుంకులమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు
-రాజరాజేశ్వరి రూపంలో దర్శనమిచ్చిన సుంకులమ్మ దేవి
కూడేరూ( అక్టోబర్ 22)AP 39 TV న్యూస్:-
కూడేరుకు సమీపాన ఉన్న పాత గొల్లపల్లి సుంకలమ్మ ఆలయంలో శరన్నవరాత్రులను పురస్కరించుకొని ఆదివారం సుంకులమ్మ దేవి మూలవిరాట్ కు ప్రత్యేక పూజ కార్యక్రమాలను ఆలయ అర్చకుడు మద్దిలేటి నిర్వహించారు. వివిధ రకాల పట్టు వస్త్రాలు ,పుష్పాలతో విశేషంగా అలంకరణ చేసి అమ్మవారిని రాజరాజేశ్వరి దేవి రూపంలో భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తర్వాత భక్తులకు అన్నదానం చేశారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు