పది ‘లో మండల టాపర్స్
‘పది ‘లో మండల టాపర్ కరుట్లపల్లి విద్యార్థి హేమంత్
-మండల సెకండ్ టాపర్ కూడేరు విద్యార్థిని భాను శ్రీ
AP39TV న్యూస్ ,కూడేరు:
పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు శనివారం వెలువడ్డాయి. కరుట్లపల్లి హైస్కూల్ కు చెందిన హేమంత్ కుమార్ 600 మార్కులకు 546 మార్కులు సాధించి మండల టాపర్గా నిలిచాడు. అదేవిధంగా కూడేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన భాను శ్రీ 543 మార్కులు సాధించి మండల సెకండ్ టాపర్గా నిలిచింది. మండలం వ్యాప్తంగా మొత్తం 336 మంది పరీక్ష రాయగా 122 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు మండల విద్యాధికారి చంద్రశేఖర్ తెలిపారు. అందులో జల్లిపల్లి ఉన్నత పాఠశాలలో 37 మందికి 14 మంది, కూడేరు హైస్కూల్లో 105 మందికి 47 మంది ,కరుట్లపల్లి హైస్కూల్లో 52 మందికి 16 మంది , కమ్మూరు హైస్కూల్లో 34 మందికి 9 మంది ,మరుట్ల హైస్కూల్లో 38 మందికి 12 మంది , కొర్రకోడు హైస్కూల్లో 30 మందికి 8 మంది , కూడేరు కేజీబీవీలో 40 మందికి 16 మంది చొప్పున ఉత్తీర్ణత సాధించారు. మండల టాపర్లుగా నిలిచిన హేమంత్ కుమార్ , భాను శ్రీని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శేషాచలం , శ్రీనివాస ప్రసాద్ , మండల విద్యాధికారి చంద్రశేఖర్ అభినందించారు.