సీఎం జగన్ కు రుణపడి ఉంటాం
సీఎం జగన్ కు రుణపడి ఉంటాం
-నూతన పింఛన్ లబ్ధిదారులు
కూడేరు (సెప్టెంబర్ 14)AP 39TV న్యూస్:-
కూడేరు మండల పరిధిలోని తిమ్మాపురం పంచాయతీలో నూతనంగా 30 మందికి వైయస్సార్ సామాజిక భద్రత పింఛన్ పథకం కింద పింఛన్లు మంజూరయ్యాయి. లబ్ధిదారులకు సోషియల్ వెల్ఫేర్ రాష్ట్ర డైరెక్టర్ నిర్మలమ్మ, సర్పంచ్ ఓబులమ్మల చేతుల మీదుగా గురువారం నగదును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నూతనంగా పింఛన్లు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. పింఛన్ లబ్ధిదారులు మాట్లాడుతూ సీఎం జగన్ కు రుణపడి ఉంటామని పేర్కొన్నారు. పింఛన్లు మంజూరు కావడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి హరి ,సచివాలయ సిబ్బంది ,వాలంటీర్లు పాల్గొన్నారు.
తమ్మిశెట్టి పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు