ఉచితంగా రిజిస్ట్రేషన్ .. పేదలకు వరం

ఉచితంగా రిజిస్ట్రేషన్ .. పేదలకు వరం

 

కూడేరు,మార్చి14(AP 39 TV న్యూస్):-

జగనన్న కాలనీలో పేదలకు ఇంటి స్థలాలు కేటాయించి పక్కా ఇల్లు నిర్మించి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి పత్రాలు ఇవ్వడం పేదలకు వరం లాంటిదని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. కూడేరులో గురువారం ఉచితంగా రిజిస్ట్రేషన్ పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కూడేరు మండల యాత్ర జగనన్న కాలనీలో ఇల్లు నిర్మించుకున్న 570 మంది మహిళలకు సర్వహక్కులు కల్పించి రిజిస్ట్రేషన్ పత్రాలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. సీఎం జగన్ పేదల పక్షపాతి అన్నారు.వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక పార్టీలకు అతీతంగా పేదలకు పక్కా ఇల్లు కట్టించడం జరిగిందన్నారు. అనంతరం రిజిస్ట్రేషన్ పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో బెస్త కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ రమణ ఎంపీపీ నారాయణరెడ్డి జెడ్పిటిసి సభ్యురాలు అశ్విని , మండల సమైక్య అధ్యక్షురాలు వసంత, అగ్రి అడ్వైజరి మండల అధ్యక్షురాలు నిర్మలమ్మ, వైస్ ఎంపీపీ దేవా,ఎంపీడీవో ఎంకే భాషా, డిప్యూటీ తహసిల్దార్ విశ్వనాథ్ ,వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ బైరెడ్డి రామచంద్రారెడ్డి, జె సి ఎస్ మండల కన్వీనర్ దేవేంద్ర, సర్పంచులు ఓబులేష్, ఓబులమ్మ ,చంద్రశేఖర్ , సువర్ణమ్మ ,నాగమ్మ ,చిన్న రంగారెడ్డి ,ధనుంజయ, రామాంజనేయులు, హనుమంత రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు రమేష్ శివలాల్ రెడ్డి, వెంకట లక్ష్మమ్మ, పార్టీ నేతలు శివరావు ,క్రిష్టప్ప, మదన్ మోహన్ రెడ్డి, శంకరయ్య, నరేష్ ,రామన్న, గంగాధర్ , సత్యనారాయణతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు .

Leave A Reply

Your email address will not be published.