ఉపాధి పనులను పరిశీలించిన ఏపీడి
ఉపాధి పనులను పరిశీలించిన ఏపీడి
కూడేరు(ఆగస్టు 19)AP 39TV న్యూస్:-
కూడేరు మండలం అరవకూరు , కమ్మూరు గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా చేస్తున్న కందకాల పనులను శనివారం ఏపీడి అనురాధ తనిఖీ చేశారు .ఈ సందర్భంగా ఆమె కూలీలతో సమావేశమయ్యారు. పనులను నిబంధనల మేరకు పనులు చేస్తే కేటాయింపు మేరకు కూలీ లభిస్తుందని తెలియజేశారు .అడిగిన వారందరికీ పనులు కల్పించాలని సిబ్బందికి ఆదేశించారు .తర్వాత కూడేరులో హౌసింగ్ ఏఈ శేఖర్ , ఉపాధి సిబ్బందితో సమావేశమై జగనన్న కాలనీలో ఇంటి ముందు ఇంకుడు గుంతల తవ్వకాలపై సమీక్ష నిర్వహించారు .స్వచ్ఛభారత్ కింద ఒక్కొక్క ఇంకుడు గుంత తవ్వకానికి 6000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుందని ఈ విషయాన్ని లబ్ధిదారులకు తెలియజేసి ఇంకుడు గుంతలు తవ్వుకునేలా చూడాలని ఆదేశించారు .కార్యక్రమంలో హౌసింగ్ ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.
తమ్మిశెట్టి పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు