వలంటీర్ శ్రీకాంత్ జ్ఞాపకార్థం అన్నదానం

వలంటీర్ శ్రీకాంత్ జ్ఞాపకార్థం అన్నదానం

కూడేరు(ఆగస్టు 6)AP 39TV న్యూస్ :

కూడేరు మండల పరిధిలోని శివరాంపేటకు చెందిన వలంటీర్ బోయ శ్రీకాంత్ (2021 మార్చిలో మృతి చెందాడు) జ్ఞాపకార్థం ఆదివారం అతడి పుట్టిన రోజును పురస్కరించుకొని శ్రీకాంత్ తండ్రి బోయ వెంకటేశులు సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మండల పరిధిలోని గొటుకూరులో ఉన్న బెరాక్ అనాధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కుమారుడు శ్రీకాంత్ వలంటీర్ గా అంకితభావంతో పనిచేస్తూ అందరికీ సేవలందించి మంచి పేరు తెచ్చుకున్నాడని పేర్కొన్నారు .ప్రతి పుట్టినరోజుకు సేవా కార్యక్రమాలు చేపడతానని ఆయన తెలిపారు.

 

 

 

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,తమ్మిశెట్టి పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.