వార్డుమెంబర్ గా గెలుపొందిన మల్లేశ్వరి
వార్డుమెంబర్ గా గెలుపొందిన మల్లేశ్వరి
కూడేరు(ఆగస్టు 19) AP 39TV న్యూస్:-
కూడేరు మండలం కలగళ్లలో శనివారం 9వ వార్డుకు జరిగిన ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. 134 మంది ఓటర్లు ఉండగా 121 ఓట్లు పోలయ్యాయి. అందులో టిడిపి మద్దతుదారురాలు పశువుల మల్లేశ్వరికి 63 ఓట్లు, వైయస్సార్ సిపి మద్దతుదారురాలు మీనుగ లక్ష్మీదేవికి 55 ఓట్లు ,ఒకటి నోటా, రెండు చెల్లని ఓట్లు ఉన్నాయి. టిడిపి మద్దతుదారురాలు పశువుల మల్లేశ్వరి 8 ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్లు రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులు డిక్లరేషన్ ఫారం అందజేశారు. ఓటింగ్ ప్రక్రియను డిఎల్డిఓ సుమతి జయంతి తనిఖీ చేశారు. ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా ఉరవకొండ సిఐ శేఖర్ , ఎస్ఐ సత్యనారాయణ తమ సిబ్బందితో కలిసి గట్టి చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో ఏఆర్ఓ హరి , ఎంపీడీవో ఎంకే భాషా ,ఈఓఆర్డి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
తమ్మిశెట్టి పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు