కలగళ్ళలో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ఘనంగా భూమి పూజ
AP39TV న్యూస్ ,కూడేరు:
కూడేరు మండలం కలగళ్ల గ్రామంలో బుధవారం వెంకటేశ్వర స్వామి ఆలయ పున: నిర్మాణం కోసం వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ భూమి పూజ కార్యక్రమం ఘనంగా సాగింది. సుమారు 500 ఏళ్ల క్రితం నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయం పాతబడి ఎలాంటి పూజలకు నోచుకోలేదు .ఈ నేపథ్యంలో కావడి సుబ్రహ్మణ్యం స్వామి అనే వ్యక్తి పాత బడిన ఈ ఆలయాన్ని నూతనంగా నిర్మించేందుకు సంకల్పించారు. ఇదే విషయాన్ని గ్రామస్తులకు చెప్పారు. గ్రామస్తులంతా సహకారం అందిస్తే 108 గ్రామాల్లో కావడి బిక్షాటన చేసి విరాళాలు సేకరిద్దామని తెలిపారు .అందుకు గ్రామస్తులు అంగీకారం తెలపడంతో 108 గ్రామాల్లో కావడి ద్వారా భిక్షాటన చేశారు. వచ్చిన విరాళాలతో, దాతలు ఇచ్చిన డబ్బుతో నూతన ఆలయ నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన చేశారు .ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ,విరాళాలు ఇచ్చిన దాతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో ఆ ప్రాంతమంతా జన సందడి నెలకొంది.. ఆలయ నిర్మాణానికి డబ్బు లేదా వస్తు రూపాన విరాళాలు ఇచ్చేందుకు దాతలు ముందుకు రావాలని కావడి సుబ్రహ్మణ్యం స్వామి, గ్రామస్తులు కోరారు.