సబ్సిడీ విత్తన వేరుశనగ పంపిణీని ప్రారంభించిన ఎంపీపీ
సబ్సిడీ విత్తన వేరుశనగ పంపిణీని ప్రారంభించిన ఎంపీపీ
AP 39 TV న్యూస్ ,కూడేరు:
కూడేరులోని వ్యవసాయ గోదాములో సోమవారం అధికారులు సబ్సిడీ విత్తన వేరుశనగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు .ఈ కార్యక్రమానికి ఎంపీపీ నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి పంపిణి ప్రారంభించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఖరీఫ్ కు సంబంధించి 40శాతం సబ్సిడీతో విత్తన వేరుశనగను అందిస్తుందన్నారు .ఈ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు .రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులందరికీ విత్తన వేరుశనగ ఇవ్వడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఆర్బికే చైర్మన్ బొజ్జాన్న యాదవ్, సర్పంచ్ లలితమ్మ ఏఓ విజయ కుమార్ వైఎస్సార్ సిపి నేతలు బైరెడ్డి రామచంద్రారెడ్డి , తిమ్మారెడ్డి ,క్రిష్టప్ప ,సంగప్ప , రామాంజనేయులు , మంజునాథ రెడ్డి, శంకరయ్య ,వెంకటరామిరెడ్డి, ఏఈఓ శైలజ , విహెచ్ఎలు రాజకుమార్ ,సాజియా తదితరులు పాల్గొన్నారు.