విగ్రహ ప్రతిష్ఠ

విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైన విశ్వేశ్వరరెడ్డి

కూడేరు, ఏప్రిల్ 4 (AP 39 TV న్యూస్):-

కూడేరు మండలం ఇప్పేరు గ్రామంలో శంభు లింగేశ్వర స్వామి దేవాలయం పునఃనిర్మాణాన్ని పురస్కరించుకొని గురువారం అలయంలో గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, గౌరిదేవి సమేత నవగ్రహ దేవతల విగ్రహ ప్రతిష్ఠ బొడ్రాయి ప్రతిష్ఠాపన వేద పండితులు మంత్రోచ్ఛారణ ఘనంగా సాగింది. ఈ కార్యక్రమానికి ఉరవకొండ ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి హాజరయ్యారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే.. బెల్డోణ శ్రీరామనాథ శాస్త్రి ఆశీర్వాదం తీసుకున్నారు. సర్పంచ్ ఓబులేసు ఎంపీటీసీ సభ్యుడు రమేష్ , ఎంపీపీ నారాయణరెడ్డి, వైస్ ఎంపిపి దేవ, పార్టీ మండల అధ్యక్షుడు బైరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ నేతలు సిపి వీరన్న, కేసన్న, తిమ్మారెడ్డి, ధనుంజయ, బాషా, కురుబ కిష్టప్ప, సిద్దారెడ్డి, నీలంకటరెడ్డి, నాగరాజు, ఎర్రప్ప, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

 

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.