విశ్వేశ్వర్ రెడ్డి ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

విశ్వేశ్వర్ రెడ్డి ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

-ఎంపీపీ నారాయణరెడ్డి

కూడేరు(AP 39 TV న్యూస్):

కూడేరు మండల పరిధిలోని కమ్మూరులో ఈనెల 21న ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారని.. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీపీ నారాయణరెడ్డి, కమ్మూరు సర్పంచ్ చిన్న రంగారెడ్డి కోరారు. సోమవారం వారు విలేకరులతో మాట్లాడారు. 21 ఉదయం 9:30 గంటలకు నూతనంగా నిర్మించిన సచివాలయం ,హెల్త్ క్లినిక్ , రైతు భరోసా కేంద్రాల భవనాలను మాజీ ఎమ్మెల్యే ప్రారంభిస్తారన్నారు .తర్వాత ఎన్నికల ప్రచారాన్ని చేపడుతారు .12 గంటలకు వలంటీర్లకు వందనం కార్యక్రమంలో భాగంగా వలంటీర్లకు సన్మాన కార్యక్రమం ఉంటుందన్నారు .ఈ కార్యక్రమాలకు మండలంలోని ప్రజా ప్రతినిధులు వైఎస్సార్ సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ బైరెడ్డి రామచంద్రారెడ్డి ,జేసీఎస్ మండల కన్వీనర్ దేవేంద్ర ,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు సంగప్ప, సింగిల్ విండో అధ్యక్షుడు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.