మాజీ ఎమ్మెల్యే “విశ్వ”కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎంపీపీ

మాజీ ఎమ్మెల్యే “విశ్వ”కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎంపీపీ

 

కూడేరు,ఫిబ్రవరి 25 (AP 39 TV న్యూస్):-

 

ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త ,మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డికి ఎంపీపీ నారాయణరెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు ,పార్టీ నేతలు ఆదివారం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతపురంలోని ఆయన నివాసంలో కలిసి బొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు .తర్వాత కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయాల్లో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి మరింత ప్రజా సేవ చేయాల‌ని ఆకాంక్షించారు.. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ బైరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రచార అధ్యక్షుడు శ్రీనివాసులు నాయుడు, ట్రేడ్ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి మంజునాథ్ రెడ్డి, సర్పంచులు , ఎంపీటీసీ సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.