“విశ్వ” కృషితో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం

“విశ్వ” కృషితో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం

-కృతజ్ఞతలు తెలిపిన బాధిత రైతు కుటుంబ సభ్యులు

 

AP 39TV టీవీ ,న్యూస్ కూడేరు:

కూడేరు మండల పరిధిలోని జయపురానికి చెందిన సతీష్ కుమార్ ,మారుతి అనే రైతులు చోళసముద్రానికి చెందిన ఎర్రి స్వామి అనే రైతు ఆర్థిక ఇబ్బందులతో కొన్ని నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నారు. బాధిత రైతు కుటుంబ సభ్యులు ,ఆయా గ్రామాల వైయస్సార్ సిపి నేతలు ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డిని కలిసి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందేలా చూడాలని విన్నవించుకున్నారు. దీంతో ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయారు .ఒక్కొక్క రైతు కుటుంబానికి రూ.7 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే అనంతపురంలోని తన స్వగృహంలో బాధిత రైతు కుటుంబ సభ్యులకు చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నారాయణ రెడ్డి, వైఎస్ఆర్ సీపీ నేతలు కురుబ ఏర్రిస్వామి ,హరిజన ఎర్రిస్వామి ,ఆంజనేయులు, శంకర్ రెడ్డి శివకుమార్, శ్రీధర్ మల్లేష్ , సంజీవ రాయుడు తదితరులు పాల్గొన్నారు.

 

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.