ఉచిత పశువు వైద్య శిబిరానికి విశేష స్పందన

చోళసముద్రంలో ఉచిత పశువు వైద్య శిబిరానికి విశేష స్పందన

 

కూడేరు(అక్టోబర్ 26)AP 39 TV న్యూస్:-

కూడేరు మండల పరిధిలోని చోళసముద్రంలో గురువారం వాటర్ షెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత పశు వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. జిల్లా పశు గణాభివృద్ధి సంస్థ కార్యనిర్వహణాధికారి డాక్టర్ సుధాకర్ ముఖ్యఅతిథిగా విచ్చేసి పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వాటికి మందులను అందజేశారు. తర్వాత వాటర్ షెడ్ టెక్నికల్ ఆఫీసర్ రమేష్ బాబు పశువుల ఎదుగుదలకు, పాల దిగుబడి పెంపొందించేందుకు గాను మినరల్ మిక్సర్ ను ఉచితంగా అందజేశారు. పశువుల ఆరోగ్యాన్ని కాపాడాలన్నదే వాటర్ షెడ్ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. పశువుల పెంపకం దారులు, రైతులు ఉచిత పశు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని వాటర్ షెడ్ చైర్మన్ పెన్నోబులేసు సూచించారు. కార్యక్రమంలో పశువైద్యాధికారి శ్వేత, ఎంపీటీసీ సభ్యుడు నాగభూషణం, వాటర్ షెడ్ సిబ్బంది గురు స్వామి, గోపాల మిత్రులు, రైతులు పాల్గొన్నారు.

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.