వ్యవసాయ పరికరాలను దొంగలిస్తే కఠిన చర్యలు

వ్యవసాయ పరికరాలను దొంగలిస్తే కఠిన చర్యలు

 

కూడేరు,AP 39 TV న్యూస్:-

 

వ్యవసాయ పరికరాలు చోరీకి పాల్పడితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ సత్యనారాయణ హెచ్చరించారు. కూడేరు మండల పరిధిలోని కొర్రకోడులో పలువురి రైతుల పొలాల్లో స్పింక్లర్ల చోరీకి పాల్పడిన ఎర్రిస్వామి ,తిరుపాల్ అనే ఇద్దరు వ్యక్తులను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి స్పింక్లర్లను ఎస్ఐ సత్యనారాయణ స్వాధీనం చేసుకొని బాధిత రైతులకు అందజేశారు. పలువురు రైతులు తమ పొలాల్లో స్పింక్లర్లు చోరీకి గురైనట్టు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టగా ఈ ఇద్దరు వ్యక్తులు దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించామనీ ఎస్ఐ తెలిపారు. కార్యక్రమంలో కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.