తాగునీటి సమస్యకు పరిష్కారం చూపిన ఆర్డబ్ల్యుఎస్ ఈఈ ,ఎంపీపీ
తాగునీటి సమస్యకు పరిష్కారం చూపిన ఆర్డబ్ల్యుఎస్ ఈఈ ,ఎంపీపీ
AP 39 TV న్యూస్ ,కూడేరు:
ఆర్డబ్ల్యూఎస్ ఈఈ జవహర్ కుమార్ ,ఎంపీపీ నారాయణరెడ్డి ,ఉరవకొండ సిఐ శేఖర్ చొరవతో కూడేరు మండల పరిధిలోని మరుట్ల మూడవ కాలనీ ,ఉదిరిపికొండ తండా గ్రామాల మధ్య నెలకొన్న తాగునీటి సమస్యకు పరిష్కారం లభించింది. శనివారం వారు ఆ గ్రామాలకు వెళ్లి రెండు గ్రామాల ప్రజలతో చర్చించారు. లైన్ మెన్ ను ఏర్పాటు చేసి సిపిడబ్ల్యూఎస్ స్కీం కింద పైపు లైన్ ద్వారా ఆరు గంటలు సేపు మరుట్ల మూడవ కాలనీకి ,మరో ఆరు గంటలసేపు ఉదిరిపికొండ తండాకు నీటిని సరఫరా చేస్తామని అధికారులు చెప్పారు. అదేవిధంగా ఉదిరిపి కొండ తండాకు పంచాయతీ తరపున మోటర్ ఏర్పాటు చేసి మంచినీరు సరఫరా చేస్తామని చెప్పారు .దీంతో ఆ రెండు గ్రామాల ప్రజలు అంగీకరించడంతో నీటి సమస్యకు తెరపడింది. ప్రతి చిన్న విషయానికి గొడవ పడకుండా రెండు గ్రామాల ప్రజలు సమన్వయంతో నడుచుకుంటూ తాగునీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచించారు .కార్యక్రమంలో ఏఎస్ఐ రామానాయుడు, పంచాయతీ కార్యదర్శి భాషా, వైఎస్ఆర్ సీపీ నేతలు నాగరాజు, దేవేంద్ర, సత్యనారాయణ, సిద్ధారెడ్డి వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.