సర్పంచ్ చొరవ.. ఏళ్ళ నాటి తాగునీటి సమస్య పరిష్కారం
కూడేరు,మార్చి 7 (AP 39 TV న్యూస్):-
సర్పంచ్ ఓబులమ్మ చొరవ .. ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి కృషితో కూడేరు మండలం కరుట్లపల్లి బిసి కాలనీలో కొన్నేళ్లుగా నెలకొన్న తాగునీటి సమస్యకు పరిష్కారం లభించింది. బిసి కాలనీవాసులు తాగునీటి కోసం పడుతున్న ఇబ్బందులను సర్పంచ్ గుర్తించి మాజీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వెళ్లారు . గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నిధులు మంజూరు కాగా అందులో నుంచి రూ.3 లక్షలతో కాలనీలో బోరు వేయించి పైప్లైన్ ద్వారా ఇంటింటికీ కొళాయిలను గురువారం ఏర్పాటు చేయించారు .తమ ఇంటి వద్దకే మంచినీరు సరఫరా కావడం.. కొన్నేళ్లుగా నెలకొన్న నీటి సమస్యకు పరిష్కారం లభించడంతో కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేశారు. సర్పంచికి ,విశ్వేశ్వర్ రెడ్డి కి కాలనీవాసులు కృతజ్ఞతలు తెలియజేశారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు