గుక్కెడు నీళ్ల కోసం

AP39 TV Channel.

గుక్కెడు నీళ్ల కోసం ఖాళీ బిందెల తో టిడిపి, సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో ఇస్లాపురం క్రాస్ వద్ద రాస్తారోకో…… పెనుకొండ నగర పంచాయతీ తిమ్మాపురం, ఇస్లాపురం, వెంకటరెడ్డి పల్లి గ్రామాలకు నీళ్లు రాకపోవడంతో ఈరోజు ఇస్లాపురం క్లాస్ వద్ద టీడీపీ, సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఒక గంటపాటు ఖాళీ బిందెలు తీసుకొని మహిళలు, ప్రజలు రాస్తారోకో నిర్వహించడం జరిగింది. మూడు గ్రామాలలో నీళ్లు అరకోరగా వస్తున్నాయి ప్రతిరోజు నీళ్ల కోసం ఇబ్బందులు పడుతున్నారని అనేకసార్లు అధికారులు దృష్టికి తీసుకుపోయిన ఫలితం లేకపోవడంతో రాస్తారోకో నిర్వహించారు. ఈ ఆందోళన కార్యక్రమం తెలుసుకున్న ఎస్సై రమేష్ బాబు గారు ఆందోళన కార్యక్రమం చేయాలని ప్రజలకు చెప్పడంతో మాకు నీళ్లు సమస్య పరిష్కారం చేసేంతవరకు ఆందోళన కొనసాగిస్తామని SI గారికి ప్రజలు తెలపడంతో అక్కడకు నగర పంచాయతీ కమిషనర్ వంశీ కృష్ణ భార్గవ్ గారు వచ్చి రేపటిలోగా నీటి సమస్య పరిష్కారం చేస్తానని హామీ ఇవ్వడంతో రాస్తరోకో విరమింప చేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి రమేష్, నియోజకవర్గ మైనార్టీ నాయకులు రియాజ్ భాషా 1,3 వార్డు కౌన్సిలర్ లు గీతా హనుమంతు, గిరి, సిఐటియు నాయకులు మహబూబ్ బాషా, వజ్రం నాగప్ప, హమాలీ భాష, హనుమంతు, సత్యం ,శ్రీరాములు, హరి, నాగరాజు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

నవీన్ కుమార్.

రిపోర్టర్

Ap 39 tv news మీడియా సోమoదేపల్లి.

Leave A Reply

Your email address will not be published.