కూడేరు PHCలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

కూడేరు PHCలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

 

 కూడేరు,మార్చి 7 (AP 39 TV న్యూస్):-

కూడేరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. డాక్టర్ సౌమ్యా రెడ్డి మాట్లాడుతూ తాము మహిళలం. తమవల్ల ఏమవుతుందని నిరుత్సాహ పడకూడదన్నారు. మహిళలు తలుచుకుంటే దేన్నైనా సాధించవచ్చన్నారు. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మీనారాయణ, ల్యాబ్ టెక్నీషియన్ వేణుగోపాల్ ఫార్మసిస్ట్ వేణుగోపాల్ సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసులు, MLHP లు జయ,మాధవి ,లోకేశ్వరి ,శిరీన్, రేష్మ, మీనాక్షి శ్రీవిద్య చంద్రకళ రాణి, ANM లు మాధవి ,సావిత్రి, రాధిక, భాను తో పాటు పలువురు ANM లు, సిబ్బంది పాల్గొన్నారు.

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.