వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ ను సద్వినియోగం చేసుకోండి
వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ ను సద్వినియోగం చేసుకోండి
-సిహెచ్ఓ జయ
కూడేరు(సెప్టెంబర్ 14)AP 39TV న్యూస్:-
వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ లో అందించే వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సిహెచ్ఓ జయ సూచించారు .బుధవారం కూడేరు మండల పరిధిలోని కమ్మూరులో వైయస్సార్ విలేజ్ క్లినిక్ ద్వారా అందించే వైద్య సేవలు గురించి ,ప్రభుత్వం నూతనంగా అమలు చేయబోతున్న జగనన్న ఆరోగ్యశ్రీ సురక్ష వైద్య శిబిరాల గురించి ఆమె ప్రజలకు అవగాహన కల్పించారు. వైయస్సార్ విలేజ్ క్లినిక్ లలో 12 రకాల వైద్య సేవలు అందుతాయని తెలియజేశారు. ఆరోగ్య సమస్యలు తలెత్తితే మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేదని ఇక్కడే మందులు అందుబాటులో ఉంటాయని ఆమె తెలియజేశారు .కేంద్ర ప్రభుత్వం అమలు చేసే ఆయుష్మాన్ భవ కార్యక్రమం గురించి కూడా వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ చిన్న రంగారెడ్డి , ఏఎన్ఎం మాధవి ,ఆశ వర్కర్లు శ్రీదేవి, ఆదేమ్మ ,చంద్రకళ, మీనాక్షి, తదితరులు పాల్గొన్నారు.
తమ్మిశెట్టి పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు