మీకు మేలు జరిగింటే వైఎస్సార్ సీపీని ఆశీర్వదించండి

మీకు మేలు జరిగింటే వైఎస్సార్ సీపీని ఆశీర్వదించండి

-వై. ప్రణయ్ రెడ్డి

కూడేరు,ఫిబ్రవరి 29(AP 39 TV న్యూస్):-

కూడేరు మండలం అరవకూరులో గురువారం వైఎస్సార్ సీపీ నేతలు “విజయ సంకల్ప యాత్ర “కార్యక్రమాన్ని నిర్వహించారు .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పార్టీ రాయలసీమ జోనల్ ఇంచార్జ్ వై ప్రణయ్ కుమార్ రెడ్డి విచ్చేశారు. .ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ద్వారా మీకు మేలు జరిగి ఉంటే ఆశీర్వదించాలని కోరారు. టిడిపి పాలనకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనకు మధ్య ఉన్న తేడాను గమనించాలని ఆయన కోరారు . విశ్వేశ్వర్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా నిత్యం ప్రజల సంక్షేమం కోసం పాటుపడతారని ఆయనకు ఒకసారి అవకాశం ఇవ్వాలని ప్రణయ్ రెడ్డి కోరారు. చుట్టపు చూపుల వచ్చే టిడిపి నేత పయ్యావుల కేశవ్ చెప్పే మాయమాటలు నమ్మి మోసపోవద్దని ఆయన ప్రజలకు సూచించారు.కార్యక్రమంలో ఎంపీపీ నారాయణ రెడ్డి, సర్పంచులు రామాంజనేయులు రంగారెడ్డి చంద్రశేఖర్ ఓబులమ్మ ధనుంజయ ఎంపిటిసి సభ్యులు రమేష్ శివ లాల్ రెడ్డి, ఆ పార్టీ మండల కన్వీనర్ రామచంద్రారెడ్డి, జెసిఎస్ మండల కన్వీనర్ దేవేంద్ర సింగల్ విండో అధ్యక్షుడు గంగాధర్, కో ఆప్షన్ సభ్యుడు సర్దార్ ,అగ్రి అడ్వైజరి మండల కమిటీ చైర్ పర్సన్ నిర్మలమ్మ, పార్టీ నేతలు రామ సుబ్బారెడ్డి క్రిష్టప్ప ,నాగరాజు, వెంకటరామిరెడ్డి, మంజునాథరెడ్డి ,నరేష్, రాచన్న గౌడ్, మదన్ మోహన్ రెడ్డి హనుమంత రెడ్డి నాగేశ్వర్ రెడ్డి లక్ష్మన్న ఎంసీఏ ఆంజనేయులు గీతమ్మ అనుబంధ సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు.

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

 

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.