కూడేరులో ఘనంగా ” YSR CP” ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

కూడేరులో ఘనంగా ” YSR CP” ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

 

కూడేరు,మార్చి12(AP 39 TV న్యూస్):-

కూడేరులో మంగళవారం YSR CP ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆ పార్టీ నేతలు ప్రజాప్రతినిధులు ఘనంగా జరుపుకున్నారు. బస్టాండ్ లో ఉన్న మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు తర్వాత పార్టీ జెండా ఆవిష్కరించారు. అందరికీ స్వీట్లు పంపిణీ చేశారు.ఎంపీపీ నారాయణ రెడ్డి మాట్లాడుతూ పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ వచ్చింది అన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమం కోసం పాటుపడిందన్నారు. కార్యక్రమంలో సర్పంచులు చిన్న రంగారెడ్డి ,ఓబులేసు,ఆ పార్టీ మండల కన్వీనర్ బైరెడ్డి రామచంద్రారెడ్డి, జెసిఎస్ మండల కన్వీనర్ దేవేంద్ర మండల కో ఆప్షన్ సభ్యుడు సర్దార్, కూడేరు సంగమేశ్వర ఆలయ ధర్మకర్త రామదుర్గం కృష్ణప్ప, నాయకులు తుప్పటి హరీష్ ,మెకానిక్ శంకర్ రెడ్డి , శివరావు, తిమ్మారెడ్డి,గంగాధర్ సత్యనారాయణ, ఎర్ర నాగప్ప, శంకర్ నాయక్ ,నాగార్జున, రమేష్ నాయక్, రామాంజనేయులు, రాజు, వేణు, కుమ్మర ఓబులప్ప, ఉదిరిపికొండ కృష్ణప్ప, నారాయణరెడ్డి ,శంకరయ్య, లోకనాథ స్వామి, లక్ష్మీనారాయణ ,గోవింద్, లక్ష్మన్నతో పాటు పలమూరు నాయకులు పాల్గొన్నారు.

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.