మహిళల ఆత్మ గౌరవాన్ని పెంచిన సీఎం జగన్

మహిళల ఆత్మ గౌరవాన్ని పెంచిన సీఎం జగన్

 

కూడేరు,మార్చి14(AP 39 TV న్యూస్):-

 

వైఎస్సార్ సిపి అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల ద్వారా మహిళలకు లబ్ధిని చేకూర్చి ఆత్మ గౌరవాన్ని పెంచారని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు .వైఎస్సార్ చేయూత నాలుగో విడత మెగా చెక్కుల పంపిణీని గురువారం కూడేరులో నిర్వహించారు .ఈ కార్యక్రమానికి విశ్వేశ్వర్ రెడ్డి అనంతపురం పార్లమెంటు సమన్వయకర్త శంకర్ నారాయణ ,పార్టీ జిల్లా అధ్యక్షుడు మహిళా నర్సింహయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

మహిళలతో కలిసి సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కూడేరు మండల వ్యాప్తంగా నాల్గవ విడతలో 2243 మంది మహిళలకు రూ.4.206 కోట్ల లబ్ధి చేకూరిందన్నారు. సీఎం జగన్ మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మహిళలంతా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మళ్ళీ వైఎస్సార్ సీపీకి అధికారాన్ని ఇవ్వాలని వారు మహిళలను కోరారు. అనంతరం మెగా చెక్కును మహిళలకు అందజేశారు కార్యక్రమంలో బెస్త కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ రమణ ఎంపీపీ నారాయణరెడ్డి జెడ్పిటిసి సభ్యురాలు అశ్విని , మండల సమైక్య అధ్యక్షురాలు వసంత, అగ్రి అడ్వైజరి మండల అధ్యక్షురాలు నిర్మలమ్మ, వైస్ ఎంపీపీ దేవా,ఎంపీడీవో ఎంకే భాషా, ఏపీఎం రాజశేఖర్,వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ బైరెడ్డి రామచంద్రారెడ్డి, జె సి ఎస్ మండల కన్వీనర్ దేవేంద్ర, సర్పంచులు ఓబులేష్, ఓబులమ్మ ,చంద్రశేఖర్ , సువర్ణమ్మ ,నాగమ్మ ,చిన్న రంగారెడ్డి ,ధనుంజయ, రామాంజనేయులు, హనుమంత రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు రమేష్ శివలాల్ రెడ్డి, వెంకట లక్ష్మమ్మ, పార్టీ నేతలు శివరావు ,క్రిష్టప్ప, మదన్ మోహన్ రెడ్డి, శంకరయ్య, నరేష్ ,రామన్న, గంగాధర్ , సత్యనారాయణతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు .

Leave A Reply

Your email address will not be published.