ప్రజా సేవకుడు విశ్వేశ్వర్ రెడ్డిని గెలిపించండి

ప్రజా సేవకుడు విశ్వేశ్వర్ రెడ్డిని గెలిపించండి 

-యువ నేత ప్రణయ్ కుమార్ రెడ్డి

కూడేరు మే3(AP 39 TV న్యూస్):-

ప్రజా సేవకుడు విశ్వేశ్వర్ రెడ్డిని గెలిపించండి.. మీకు అందుబాటులో ఉండి కూడేరు మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాడని యువ నేత ప్రణయ్ కుమార్ రెడ్డి ప్రజలను కోరారు. శుక్రవారం కూడేరులో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ నేతలు ప్రజలు గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు అడుగడుగునా ఆయనపై పూలవర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడిపి పాలనకు వైఎస్ఆర్సిపి పాలనకు మధ్య తేడాను గమనించాలన్నారు. ఐదేళ్లలో ప్రభుత్వం ద్వారా మీ ఇంటికి లబ్ధి చేకూరి ఉంటేనే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఆయన కోరారు. అందుబాటులో ఉందని పయ్యావుల కేశవ్ కు ఓటుతో బుద్ధి చెప్పాలని ప్రజలకు సూచించారు. ఐదేళ్లలో మండలంలో జరిగిన అభివృద్ధిని గురించి వివరించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు తోపుదుర్తి వెంకటలక్ష్మమ్మ, ఎంపీపీ నారాయణ రెడ్డి, వైస్ ఎంపీపీలు సుబ్బమ్మ ,దేవా, పార్టీ మండల కన్వీనర్ రామచంద్రారెడ్డి , మండల కో ఆప్షన్ సభ్యుడు సర్దార్ వలి , సర్పంచులు రామాంజనేయులు హనుమంత రెడ్డి చంద్రశేఖర్ రంగారెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు రమేష్,నాయకులు విజయభాస్కర్ రెడ్డి రామదుర్గం కృష్ణప్ప తోపుదుర్తి రామాంజనేయులు, కొండ, శంకర్ నాయక్ ,శంకర్ రెడ్డి , శివ , వేణు ,శ్రీకాంత్ , ఈశ్వరయ్య ,శివరావు ,రమేష్ నాయక్, హరిజన సంగప్ప, దేవేంద్ర గంగాధర్ రాచన్న గౌడ్, భాస్కర్ రెడ్డి, ఎర్రి స్వామి, నరేష్, సత్యనారాయణ ,హనుమంతు నాయక్ ,రాఘవయ్య ,లక్ష్మణ యాదవ్, ఓబుళపతి తదితరులు పాల్గొన్నారు.

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.