ఉరవకొండలో వైఎస్సార్ సీపీ జండా ఎగరడం ఖాయం
కూడేరు,మే9(AP 39 TV న్యూస్):-
టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్ ఎన్ని కుట్రలు పన్నినా ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి వై. విశ్వేశ్వర్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపొంది ఉరవకొండలో వైఎస్సార్ సీపీ జెండా ఎగరవేయడం ఖాయమని యువ నేత వై ప్రణయ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం కూడేరు మండల పరిధిలోని జయపురం , చోళసముద్రం, కొర్రకోడు గ్రామాల్లో ప్రణయ్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఆయా గ్రామాల్లో మహిళలు హారతులు పట్టారు .పార్టీ నేతలు ,ప్రజలు గజమాలలు, పూలమాలతో ఘనంగా స్వాగతం పలికారు. అడుగడుగునా ఆయనపై పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా నాన్న విశ్వేశ్వర్ రెడ్డి నిత్యం ప్రజల్లో ఉండే మనిషి అన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మా నాన్నను ఆదరించాలని ఆయన ప్రజలను కోరారు. టిడిపి నేతలు చెప్పే మాయమాటలను నమ్మి మోసపోవద్దని తెలియజేశారు. వైఎఎస్సార్ సిపి తోనే సంక్షేమ పథకాలు అమలు కావడం.. అభివృద్ధి పనులు జరగడం సాధ్యమవుతుందన్నారు. కాబట్టి మీరందరూ మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో ఎంపీపీ నారాయణరెడ్డి, ఎంపిటిసి సభ్యులు నాగభూషణం ,శివలాల్ రెడ్డి, సర్పంచులు చంద్రశేఖర్ ,పార్టీ మండల కన్వీనర్ బైరెడ్డి రామచంద్రారెడ్డి ,నేతలు హరినాథ్ రెడ్డి ,శంకర్ రెడ్డి, కొర్రకోడు రాజశేఖర్, తుప్పటి హరీష్ ,కొత్త కాపు సిద్ధారెడ్డి, దేవేంద్ర ,మదన్ మోహన్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, చోళసముద్రం గంగాధర్, పెన్నోబులేసు, ,సూర్యనారాయణ, నారాయణరెడ్డి, సంజీవ రాయుడు ఎర్రిస్వామి ,గోపాల్ నారాయణ, వెంకటరామిరెడ్డి వెంకటేష్ లాలెప్ప, అశోక్ లోకనాథ్ స్వామి, శంకర్ నాయక్ రమేష్ నాయక్ తోపాటు పలువురు సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు