YSR CP విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయండి
YSR CP విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయండి
-ఎంపీపీ నారాయణరెడ్డి, మండల కన్వీనర్ బైరెడ్డి రామచంద్రారెడ్డి
కూడేరు (అక్టోబర్16)AP 39 TV న్యూస్:-
కూడేరులోని ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఆవరణంలో (వాణి స్కూల్ ఎదురుగా) మంగళవారం YSR CP విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంపీపీ నారాయణరెడ్డి, మండల కన్వీనర్ బైరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం తెలిపారు. అలాగే ఇటీవల నియమింపబడిన పార్టీ నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందన్నారు. తొలత ఉదయం 9:30 గంటలకు మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరుగుతుంది. అనంతరం సభా వేదిక వద్దకు ర్యాలీ ఉంటుందన్నారు. మొదట నూతన కమిటీ ప్రమాణ స్వీకారం, అనంతరం విస్తృత స్థాయి సమావేశం ఉంటుందన్నారు. ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, పార్టీ నియోజకవర్గ పరిశీలకులు శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య,ఎంపీ తలారి రంగయ్య, యువనేత వై.ప్రణయ్ రెడ్డి హాజరవుతారని చెప్పారు. కార్యక్రమాలకు జెడ్పిటిసి, వైస్ ఎంపీపీలు, సర్పంచులు, ఎంపిటిసిలు,కో అప్షన్ సభ్యులు, వార్డు సభ్యులు, మండల అగ్రి అడ్వైజరి బోర్డు చైర్మన్, జేసీఎస్ కన్వీనర్, సచివాలయ కన్వీనర్లు,గృహసారథులు, పార్టీ కమిటీ సభ్యులు, బూత్ కమిటీ కన్వీనర్లు, పిఏసీఎస్ చైర్మన్, డైరెక్టర్లు, కార్పొరేషన్ల డైరెక్టర్లు, ఇతర నేతలు తప్పక హాజరు కావాలని వారు కోరారు.
పవన్ కుమార్ ,
రిపోర్టర్ ,
కూడేరు.