పేద విద్యార్థులకు బంగారు భవిష్యత్తునందించాలన్నదే సీఎం లక్ష్యం

పేద విద్యార్థులకు బంగారు భవిష్యత్తునందించాలన్నదే సీఎం లక్ష్యం

 

-ఎంపీపీ నారాయణరెడ్డి

 

 

కూడేరు,AP 39 TV న్యూస్:-

పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్షమనీ ఎంపీపీ నారాయణరెడ్డి పేర్కొన్నారు. గురువారం కూడేరు మండల పరిధిలోని కమ్మూరు హైస్కూల్లో 8వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందజేసిన ట్యాబులను ఎంపీపీ నారాయణ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ప్రభుత్వము ఇంతవరకు ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చింది లేదన్నారు .సీఎం గా జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక నాడు- నేడుతో ప్రభుత్వ బడుల రూపురేఖలే మార్చి పిల్లలకు మౌలిక వసతులతో పాటు నాణ్యమైన విద్యను అందేలా చేశారన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ చంద్రశేఖర్, సర్పంచ్ రంగారెడ్డి, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ బైరెడ్డి రామచంద్రారెడ్డి, ట్రేడ్ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి మంజునాథ్ రెడ్డి, పార్టీ నేతలు వన్నూరప్ప, ఉపాధ్యాయులు ,పిల్లలు, వారి తల్లిదండ్రులు , పంచాయతీ కార్యదర్శి మురళి పాల్గొన్నారు.

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.