Home AP పైలా… పెయిలా?

పైలా… పెయిలా?

7
0

అనంతపురం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నూతన జిల్లా అధ్యక్షులుగా పైలా నరసింహయ్యను అధిష్టానం నియమించింది. అధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు అంటే ఆశామాసినా, ఇలాంటి పదవి వస్తే ఆ హంగామా ఎలా ఉంటుందో గతంలో కాపు రామచంద్రారెడ్డి విషయంలో చూశాం. కానీ ఇప్పుడు పైలా నరసింహయ్యకిస్తే ఎమ్మెల్యేలు గానీ, ఎంపీ గాని, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గానీ, డిప్యూటీ మేయర్లు గాని, మిగిలిన వైసీపీ ముఖ్య నాయకులు ఎందుకు రాలేదు అనేది ప్రజల మదిలో సవా లక్ష ప్రశ్నలు రేకెత్తిస్తోంది. ఎంపీ తలారి రంగయ్య కు హార్ట్ ఎటాక్ ఓకే, ఎమ్మెల్యే అనంతకు కలెక్టర్ తో మీటింగ్ ఇదీ ఓకే, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి గడపగడప కు మన ప్రభుత్వం కార్యక్రమంలో, ఎవరి పనిలో వారున్నారు. ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా, సప్పగా సాగిపోయింది పైలా నరసింహయ్య జిల్లా అధ్యక్ష పదవి ప్రోగ్రాం. ఇంతకు వైసీపీలో ఫైలాకు అధ్యక్ష పదవి ఇవ్వడం మిగిలిన నాయకులకు ఇష్టం లేదనా, లేక అనివార్య కారణాలవల్ల రాలేకపోయారా అనేది ప్రశ్న గానే మిగిలిపోయింది. ప్రజలు మాత్రం ఆశ్చర్యానికి గురవుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here