జగన్ మరో సంచలనం. తెరపైకి రుణమాఫీ!

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్షాలకు బ్యాడ్ న్యూస్ లు ప్రజలకు గుడ్ న్యూస్ లు జగన్ వరుసపెట్టి చెబుతున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా తాజాగా రుణమాఫీ అనే అంశం తెరపైకి వచ్చిందని తెలుస్తుంది.

 

దీంతో… ఈ పథకంపై ఏపీలోని పొలిటికల్ సర్కిల్స్ లో తీవ్ర చర్చ నడుస్తుందంట.

 

అవును… రాబోయే ఎన్నికల్లో గెలుపు పక్కా అనే ధీమాతోనే ఉన్నట్లు కనిపిస్తున్న జగన్… టార్గెట్ 175 పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో రాబోయే ఎన్నికల్లో టీడీపీ – జనసేనలను చావు దెబ్బ కొట్టాలని వ్యూహాలు పన్నుతున్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగానే జగన్ సరికొత్త పథకాల దిశగా ఆలోచిస్తున్నారని తెలుస్తుంది.

 

ముఖ్యమంత్రి జగన్ వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. దీనికోసం 2019లో అధికారంలోకి వచ్చిన సమయం నుంచి ప్రణాళికలు అమలు చేస్తూనే ఉన్నారని అంటుంటారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు పరుస్తూ ముందుకు వెళ్తున్నారని అంటున్నారు. కరోనా సమయంలో కూడా.. ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపించే ప్రయత్నం చేయలేదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా పథకాల అమలు ఆపలేదు.

 

దీంతో సంక్షేమం విషయంలోనూ, ప్రజలను పట్టించుకునే విషయంలోనూ జగన్ కు ఫుల్ మార్కులే పడుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. ఇదే సమయంలో జగనన్న సురక్ష ద్వారా అర్హత ఉండి పథకాల్లో చేరని వారి కోసం మరో అవకాశం కల్పిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా ఈ పథకాలు అమలు అయ్యేలా చూస్తున్నారని తెలుస్తుంది.

 

అయితే సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమానికి పోటీగా తాజాగా టీడీపీ సంక్షేమ పథకాలను ప్రకటించింది. రాజమండ్రిలో జరిగిన మహానాడు వేదికగా ఒక లిస్ట్ విడుదల చేసింది. అయితే అవన్నీ జగన్ పథకాలకు కొనసాగింపుగానే ఉన్నాయి తప్ప సొంతంగా ఆలోచించినట్లు లేవనే కామెంట్లు వినిపించాయి. ఫలితంగా కాపీ క్యాట్ అంటూ ఆన్ లైన్ వేదికగా సెటైర్స్ వినిపించాయి.

 

ఇదే క్రమంలో రైతులను మరింత దగ్గర చేసుకోవటంతో పాటుగా.. ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా చేయాలని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా… రైతులకు రుణమాఫీపైన ఆలోచన జరుగుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిని ఎన్నికలకు ముందే అమలు చేయటమా.. లేక, రాబోయే ఎన్నికల సమయంలో స్పష్టమైన హామీ ద్వారా ప్రతిపక్షాలను పూర్తిగా ఆత్మరక్షణలోకి నెట్టడమా అనే ఆలోచనలు జరుగుతున్నాయని తెలుస్తుంది.

 

అయితే 2014లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి ప్రచారం చేసిన సమయంలో రైతు రుణమాఫీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కచ్చితంగా రైతు రుణమాఫీ ఉంటుందని చంద్రబాబు చెబితే… అమలు జరగకపోతే ప్రశ్నించే బాధ్యత తనదని పవన్ చెప్పుకొచ్చారు! తీరా అధికారంలోకి వచ్చిన తరువాత అమలులో షరుతులు పెట్టారు చంద్రబాబు. దీంతో… పూర్తి స్థాయిలో రుణాలు అమలుచేయకుండా.. మమా అనిపించి రైతు ఆగ్రహం చవిచూశారు.

 

యితే ఇప్పటికే చెప్పాడంటే చేస్తాడంతే అనే పేరు సంపాదించుకున్న జగన్… ఈ మేరకు రుణమాఫీ హామీని తెరపైకి తెస్తే ప్రజలు విశ్వసించే ఛాన్స్ ఉందని అంటున్నారు విశ్లేషకులు. జగన్ కూడా ఆదిశగానే ఆలోచనలు చేస్తున్నారని తెలుస్తుంది. ఫలితంగా… పూర్తిగా పాజిటివ్ ఓట్ ను నమ్ముకున్న జగన్.. ఈ విషయంలో కీలక నిర్ణయమే తీసుకోబోతున్నారని అంటున్నారు పరిశీలకులు! అదే జరిగితే… బాబు బ్యాచ్ కు బ్యాడ్ న్యూసే అనే కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.

B.Hanukant Reddy

Reporter

Leave A Reply

Your email address will not be published.