సర్పంచ్ రంగారెడ్డి ఆధ్వర్యంలో విశ్వేశ్వరరెడ్డికి ఘన స్వాగతం

సర్పంచ్ రంగారెడ్డి ఆధ్వర్యంలో విశ్వేశ్వరరెడ్డికి ఘన స్వాగతం

కూడేరు(AP 39 TV న్యూస్):-

కూడేరు మండలం కమ్మూరులో ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి బుధవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించేందుకు వచ్చారు .ఈ సందర్భంగా సర్పంచ్ చిన్న రంగారెడ్డి ఆధ్వర్యంలో విశ్వేశ్వర రెడ్డికి ఘన స్వాగతం పలికారు .ఆయనపై పూల వర్షం కురిపించారు.వైఎస్సార్ సీపీ నేతలు గజమాల వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు . మహిళలు హారతులు పట్టారు. జై జగన్ .. విశ్వేశ్వర్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ కార్యకర్తలు, నేతలు నినాదాలు చేశారు. అనంతరం విశ్వేశ్వర్ రెడ్డి పెద్దమ్మ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ నారాయణరెడ్డి, జడ్పిటిసి సభ్యురాలు అశ్విని, మండల కన్వీనర్ బైరెడ్డి రామచంద్రారెడ్డి, అగ్రి అడ్వైజరి మండల కమిటీ అధ్యక్షురాలు నిర్మలమ్మ,ఆ పార్టీ నేతలు ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు సంగప్ప, నేతలు పెద్ద రంగారెడ్డి, నారాయణస్వామి రామసుబ్బారెడ్డి, రామాంజనేయులు, రంగనాథరెడ్డి ,వెంకటరామిరెడ్డి, వన్నూరప్ప తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్,

రిపోర్టర్,

కూడేరు.

Leave A Reply

Your email address will not be published.