ఘనంగా శ్రీ శ్రీ శ్రీ భగీరథ మహర్షి జయంతి వేడుకలు
ఘనంగా శ్రీ శ్రీ శ్రీ భగీరథ మహర్షి జయంతి వేడుకలు
అనంతపురం, ఏప్రిల్ 27 :
శ్రీ శ్రీ శ్రీ భగీరథ మహర్షి జయంతి వేడుకల సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం అనంతపురం నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్ వద్ద ఉన్న శ్రీ శ్రీ శ్రీ భగీరథ మహర్షి విగ్రహానికి జిల్లా కలెక్టర్ పి.గౌతమి, ఎంపీలుతలారి రంగయ్య,గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయగిరిజమ్మ, నగరపాలక సంస్థ మేయర్ వసీం, డిప్యూటీ మేయర్లు కోగటం విజయభాస్కర్ రెడ్డి, వాసంతి సాహిత్య,రాష్ట్ర నాటక అకాడమీ ఛైర్మన్ హరిత,ఆహుడా ఛైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్, ఏడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ లిఖిత, తదితరులు పుష్పమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు…ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ప్రయత్నానికి, కార్యదీక్షకు మారుపేరు శ్రీశ్రీశ్రీ భగీరథ మహర్షి అని అన్నారు. ఒక కార్యక్రమాన్ని చేయాలంటే పట్టుదలతో, చిత్తశుద్ధితో కృషిచేసిన వారిని అపర భగీరథుడు అని అంటారని, భగీరథ మహర్షి కార్య దక్షతకు నిదర్శనమన్నారు. ప్రభుత్వం అధికారికంగా భగీరథ మహర్షి జయంతి వేడుకలను నిర్వహిస్తోందని, భగీరథ మహర్షిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ డిడి కుష్బూ కొఠారి ,బీసీ వెల్ఫేర్ అధికారులు, సగర కుల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.