భారీ బైక్ ర్యాలీతో తరలి వెళ్లిన ప్రణయ్ రెడ్డి

భారీ బైక్ ర్యాలీతో తరలి వెళ్లిన ప్రణయ్ రెడ్డి

 

కూడేరు,ఫిబ్రవరి 29(AP 39 TV న్యూస్):-

అరవకూరులో గురువారం వైఎస్సార్ సీపీ నేతలు “విజయ సంకల్ప యాత్ర “కార్యక్రమాన్ని నిర్వహించారు .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పార్టీ రాయలసీమ జోనల్ ఇంచార్గ్ వై ప్రణయ్ కుమార్ రెడ్డి విచ్చేశారు. తొలత కూడేరులో ఆ పార్టీ నేత ఎర్ర నాగప్ప ఇంటి వద్ద నుంచి అరవకూరు వరకు పార్టీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీ నడుమ ప్రణయ్ కుమార్ రెడ్డి కాన్వాయ్ ముందుకు సాగింది .ఈ సందర్భంగా జై జగన్ జై విశ్వేశ్వర్ రెడ్డి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నారాయణ రెడ్డి, ఆ పార్టీ సర్పంచులు ,ఎంపీటీసీ సభ్యులు ,అనుబంధ సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు.

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.