కమ్మూరులో సబ్సిడీ విత్తనాల పంపిణీ

కమ్మూరులో సబ్సిడీ విత్తనాల పంపిణీ

-రైతులకు విత్తనాల ప్యాకెట్లను అందజేసిన సర్పంచ్ రంగారెడ్డి

కూడేరు(సెప్టెంబర్ 5)AP 39TV న్యూస్:-

కూడేరు మండలం పరిధిలోని కమ్మురులో 80 శాతం సబ్సిడీతో రైతులకు విత్తన పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం రైతు భరోసా కేంద్రంలో వ్యవసాయ అధికారులు చేపట్టారు .ఈ కార్యక్రమానికి సర్పంచ్ రంగారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి రైతులకు విత్తన ప్యాకెట్లను అందజేశారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు .అందుకే 80 శాతం సబ్సిడీతో ఉలవ ,జొన్న వంటి విత్తనాలను రైతులకు అందించడానికి ముందుకు వచ్చిందన్నారు .రైతులు సబ్సిడీతో అందించే ఈ విత్తనాలను సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఆర్బికే సిబ్బంది రైతులు పాల్గొన్నారు .

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

తమ్మిశెట్టి పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.