NCC శిక్షణ కేంద్రాల అభివృద్ధికి చర్యలు
NCC శిక్షణ కేంద్రాల అభివృద్ధికి చర్యలు
-తెలుగు రాష్ట్రాల NCC జనరల్ డిప్యూటీ డైరెక్టర్ V.M. రెడ్డి
కూడేరు(సెప్టెంబర్ 6)AP 39TV న్యూస్:-
ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణలో NCC శిక్షణ కేంద్రాలు అభివృద్ధికి చర్యలు చేపట్టినట్లు ఆ రెండు రాష్ట్రాల NCC జనరల్ డిప్యూటీ డైరెక్టర్ V.M. రెడ్డి తెలిపారు .బుధవారం ఆయన కూడేరు మండల పరిధిలోని NCC నగర్ లో జరుగుతున్న సిఏటిసి -6వ 6 ఆంధ్ర బెటాలియన్ శిక్షణ తరగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయనకు NCC అధికారులు ,క్యాడేట్లు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన క్యాడేట్లకు ఏర్పాటు చేసిన వసతి భవనాలను ,మరుగుదొడ్లను, నీటి సౌకర్యాన్ని ,వంటశాలను , పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు .తర్వాత క్యాడేట్లకు ఫైరింగ్ మ్యాప్ రీడింగ్ పై ఇస్తున్న శిక్షణను తనఖీ చేశారు .అనంతరం అధికారులతో మాట్లాడుతూ శిక్షణను పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. తర్వాత క్యాడేట్లతో మాట్లాడుతూ NCC శిక్షణ మీ భవితకు దోహదపడుతుందని అన్నారు .ఇక్కడ నేర్చుకున్న ప్రతి అంశాన్ని సమాజంలోకి వెళ్లాక కొనసాగించాలని సూచించారు. మంచి మార్గంలో పయనిస్తూ ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆయన పిలుపునిచ్చారు .కార్యక్రమంలో కర్నూల్ గ్రూప్ కమాండర్ ఎన్ రమేష్ , ప్రణాళిక , సహకారం అసిస్టెంట్ డైరెక్టర్ సంజయ్ గుప్తా, క్యాంపు కమాండర్ సందీప్ ముంద్ర, NCC అధికారులు రాకేష్, అనంతపురం కర్నూల్ పుట్టపర్తి నంద్యాల జిల్లాలకు చెందిన NCC క్యాడేట్లు పాల్గొన్నారు.
తమ్మిశెట్టి పవన్ కుమార్
రిపోర్టర్
కోడేరు