పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఎమ్మెల్యే తిప్పేస్వామి
పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు
ఎమ్మెల్యే తిప్పేస్వామి
AP 39TV NEWS మే 3
గుడిబండ:-రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన నవరత్నాల పథకం ద్వారా అర్హులందరికీ సంక్షేమ పథకాల లబ్ధిని చేకూర్చారని ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి పేర్కొన్నారు గుడిబండ మండల పరిధిలోని ఆచారి పాలెం గ్రామంలో బుధవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే తిప్పేస్వామి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు గ్రామస్థాయిలో పార్టీలకు అతీతంగా అర్హులందరికీ అందించామని వివరించారు ప్రజల సంక్షేమమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యమని అన్నారు. అదేవిధంగా సచివాలయ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత కల్పించడంతోపాటు ఒక్క సచివాలయం పరిధిలోని గ్రామాలకు ప్రధాన సమస్యలు తీర్చడానికి 20 లక్షల రూపాయలు నిధులతో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని, కావున రానున్న ఎన్నికల్లో ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలుస్తూ మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వక్కలిగ కార్పోరేషన్ ఛైర్మన్ నళిని, వైకాపా నాయకుడు నాగరాజు గుప్త విఆర్ఓ నరసింహమూర్తి, ఫీల్డ్ అసిస్టెంట్ నరసింహరాజు, తదితర వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కోంకల్లు శివన్న
గుడిబండ , మడకశిర ఇంఛార్జి
సత్యసాయి జిల్లా