వలంటీర్లకు నియామక పత్రాలు అందజేత

వలంటీర్లకు నియామక పత్రాలు అందజేత 

కూడేరు(ఆగస్టు 31)AP 39TV న్యూస్:-

కూడేరు ,ఇప్పేరు ,కొర్రకోడు, మరుట్ల గ్రామాల్లో ఖాళీగా ఉన్న వలంటీర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. మరుట్లకు అభ్యర్థులు ఎవరు దరఖాస్తు చేసుకోలేదు. కూడేరుకు అంజలి , ఇప్పేరుకు ఎర్రిస్వామి , కొర్రకోడుకు రాజశేఖర్ ఎంపిక కావడంతో గురువారం ఎంపీపీ నారాయణరెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు. విధులను అంకితభావంతో నిర్వర్తిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఎంపీపీ వారికి సూచించారు .కార్యక్రమంలో ఎంపీడీవో ఎంకే భాషా తదితరులు పాల్గొన్నారు.

 

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

తమ్మిశెట్టి పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.