విశ్వేశ్వర రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించండి

విశ్వేశ్వర రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించండి 

–వై .ప్రణయ్ కుమార్ రెడ్డి

 

కూడేరు మే 1(AP 39 TV న్యూస్):-

ఉరవకొండ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వై విశ్వేశ్వర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి ..నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాడని ఆ పార్టీ యువజన విభాగం రాయలసీమ జోనల్ ఇంచార్జ్ వై. ప్రణయ్ కుమార్ రెడ్డి ప్రజలను కోరారు .బుధవారం కూడేరు మండల పరిధిలోని ఉదిరిపి కొండ తండా, మరుట్ల-3వ ,మరుట్ల-2 వ ,మరుట్ల-1వ కాలనీలో రోడ్డు షో ద్వారా ఎన్నికల ప్రచారాన్ని ప్రణయ్ కుమార్ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు మహిళలు హారతులు పట్టగా పార్టీ నేతలు ప్రజలు పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు. అడుగడుగునా ఆయనపై పూల వర్షం కురిపించారు. ఆయన మాట్లాడుతూ టిడిపి నేతలు చెప్పే మాయమాటలు విని మోసపోవద్దన్నారు.. టిడిపి ది మోసపూరిత మేనిఫెస్టో తిన్నాను హామీల్లో అధిక భాగం అమలుకానివే ఉన్నాయని ప్రజలకు వివరించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చారని గుర్తు చేశారు. అభివృద్ధి పనులు కూడా చేపట్టారన్నారు. మళ్లీ సంక్షేమ పథకాలు కొనసాగాలన్న.. అభివృద్ధి పనులు జరగాలన్న ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని ప్రణయ్ రెడ్డి ప్రజలను కోరారు. అందుబాటులో లేని పయ్యావుల కేశవ్ కు ఓటుతో బుద్ధి చెప్పాలని, ప్రజల్లో ఉండే విశ్వేశ్వర్ రెడ్డినీ గెలిపించాలని ప్రజలను కోరారు.. కార్యక్రమంలో సర్పంచులు నాగమ్మ ,లావణ్య ,ఎంపిటిసి సభ్యులు శ్రీదేవి ,ఓబులమ్మ, , పార్టీ నేతలు రమేష్ నాయక్ , రామ్మోహన్ ,క్రిష్టప్ప ,నరేష్, చత్రే నాయక్ ,హనుమంతు నాయక్ ,లక్ష్మన్న యాదవ్, రాఘవయ్య ,సత్యనారాయణ, నరసింహులు ,ఎర్రిస్వామి , శ్రీనివాసులు ,నీలకంఠ రెడ్డి, రాజశేఖర్, పరమేశ్వర్ రెడ్డి, శ్రీరామ్ రెడ్డి, నాగరాజు ,ఈశ్వర్ రెడ్డి ,దేవేంద్ర గంగాధర్ ,మదన్మోహన్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి ,శంకర్ నాయక్ ,రమేష్ నాయక్, మంజునాథ్ రెడ్డి ఎంపీపీ నారాయణరెడ్డి , వైస్ ఎంపీపీ దేవా,పార్టీ మండల కన్వీనర్ రామచంద్రారెడ్డి ,పలవురు సర్పంచులు ,ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.