కూడేరులో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
కూడేరు,ఏప్రిల్14(AP 39 TV న్యూస్):-
అంబేద్కర్ జయంతి వేడుకలను కూడేరులో ఆదివారం ఎంఆర్పిఎస్, వీహెచ్పిఎస్ నేతలు ఘనంగా జరుపుకున్నారు .అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు .ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ కృషి చేద్దామని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో vhps రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దన్న, , ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు పాల ఈశ్వరయ్య ఉపాధ్యక్షులు ఆంజనేయులు విహెచ్పిఎస్ మండల అధ్యక్షులు శ్రీరాములు , నాయకులు కృష్ణమూర్తి విహెచ్ పిఎస్ మండల ఉపాధ్యక్షులు వెంకటేశు సిద్ధప్ప జగన్నాథ్ తదితరులు పాల్గొన్నారు
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు